లోక్‌సభ ఎంపీలకు ఇచ్చే జీతం ఎంతో తెలుసా? అలవెన్సులు కూడా..

మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

By Srikanth Gundamalla  Published on  12 Jun 2024 3:15 PM IST
lok sabha, MP, salary,  allowances,

లోక్‌సభ ఎంపీలకు ఇచ్చే జీతం ఎంతో తెలుసా? అలవెన్సులు కూడా.. 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దాంతో.. మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలను తీసుకున్నారు. కేంద్ర మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు జరిగింది. కాగా.. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మరి లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలకు జీతం ఎంత వస్తుంది..? మిగతా అలవెన్స్‌లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

లోక్‌సభ ఎంపీలకు జీతం లక్ష రూపాయలు ఇస్తారు. ఇక నియోజకవర్గ ఖర్చుల కోసం రూ.70వేలు నెలకు ఇస్తారు. అలాగే ఆఫీస్ నిర్వహణ కోసం రూ.60 వేలు అందుకుంటారు లోక్‌సభ సభ్యులు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన కూడా డీఏ కింద రోజుకు రూ.2వేలు అందుకుంటారు. ఎంపీ తన భాగస్వామితో కలిసి ఏడాదికి 34 సార్లు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా విమానంలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అంతేకాదు..వ్యక్తిగత, అధికారిక పనుల కోసం రైలులో ఫస్ట్‌ క్లాస్ ప్రయాణం చేయొచ్చు.

ఇక నియోజకవర్గంలో పర్యటించినప్పుడు టీఏ క్లెయిమ్ చేసుకునేందుకు ఎంపీలకు అవకాశం ఉంటుంది. పదవీ కాలం పూర్తయ్యే వరకు ఉచిత వసతి సౌకర్యం.. వసతి కోసం నెలకు రూ.2లక్షలు వస్తాయి. అలాగే ఎంపీ కుటుంబానికి ఉచిత వైద్య సదుపాయం ఉంటుంది. పదవీ కాలం పూర్తయిన తర్వాత నెలకు రూ.25వేలు పెన్షన్ అందుకుంటారు. ఉచిత ఫోన్‌ కాలం సదుపాయం ఉంటుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు రూ.50వేల యూనిట్ల వరకు విద్యుత్‌ను వాడుకోవచ్చు.

Next Story