రేపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది.

By Srikanth Gundamalla
Published on : 15 March 2024 1:07 PM IST

lok sabha, election schedule, election commission ,

రేపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌   

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. షెడ్యూల్‌ను ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. మార్చి 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పింది. ఈ మేరకు ఇదే విషయాన్ని ఎక్స్‌ వేదిక ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా రేపు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించనుంది.

లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సిద్ధం అయ్యాయి. కాంగ్రెస్‌ ఇండియా కూటమిగా ఏర్పడింది. అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించి తాము అధికారంలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక మరోవైపు మోదీ మేనియా, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలే ఆయుధంగా ఎన్డీఏ కూటమి ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తేదీ ప్రకటించడంతో అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి.


Next Story