కిరాతకంగా హత్యాచారం.. ట్రైనీ డాక్టర్‌ పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలనాలు

పశ్చిమబెంగాల్‌లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2024 10:50 AM IST
kolkata, trainee doctor, rape and murder, atopsy report ,

కిరాతకంగా హత్యాచారం.. ట్రైనీ డాక్టర్‌ పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలనాలు

పశ్చిమబెంగాల్‌లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికీ జూనియర్ డాక్టర్లు బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు. కాగా.. తాజాగా హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్‌ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు అతి కిరాతకంగా అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడ్డాడినట్లుగా తెలిసింది.

ట్రైనీ డాక్టర్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి, దీనిపై దర్యాప్తు చేసేందుకు బెంగాల్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆగస్టు 9 తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య హత్య, అత్యాచారం జరిగి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేశారు.

మహిళ ముఖంపై ఉన్న గీతలు నిందితుడి వేలుగోళ్ల వల్ల వచ్చాయని నివేదికలో వైద్యులు చెప్పారు. బాధితురాలు తిరిగి పోరాడేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సూచిస్తుందని పేర్కొన్నారు. ఆమె అరవకుండా నోరు, గొంతును నిరంతరం నొక్కుతూనే ఉన్నట్లు చెప్పారు. ఊపిరి ఆడకుండా గొంతును బిగించినట్లు నివేదిక చెబుతోంది. అలాగే మహిళ రెండు కళ్లు ,నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అవుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. కంటికి గాయం కావడం పై కారణాన్ని ఇంకా చెప్పలేదు. మృతురాలి కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులపై కూడా గాయాలు ఉన్నాయి. ఆమె రెండు కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతోందని.. ముఖంపై గోళ్ళ గాయాలున్నాయని నివేదిక పేర్కొంది. కెమెరాలో నిర్వహించిన పోస్ట్‌మార్టంలో ఇద్దరు మహిళా సాక్షులు, మహిళ తల్లి ఉన్నారు. ఈ నేరం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగినట్లు కోల్‌కతా పోలీసు సీనియర్ అధికారి తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి కోల్‌కతా పోలీసుల పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. రాయ్ RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై కోల్‌కతాతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో వైద్యులు, నర్సులు నిరసనలు దిగారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలావుండగా, పోలీసులు ఈ కేసును త్వరగా ఛేదించలేకపోతే దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తామని కోల్‌కతా పోలీసులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Next Story