అమ్మాయిలూ కోరికలను నియంత్రించుకోవాలి.. కోర్టు సంచలన కామెంట్స్
యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని కోల్‌కతా కోర్టు సూచించింది.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 7:45 PM ISTఅమ్మాయిలూ కోరికలను నియంత్రించుకోవాలి.. కోర్టు సంచలన కామెంట్స్
కోల్‌కతా కోర్టు సంచలన కామెంట్స్ చేసింది. పోక్సో కేసులో విచారణ సందర్భంగా.. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నేరం కింద యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో విచారణ జరిపంది న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్‌లతో కూడిన డివిజన్ బెంజ్. అయితే.. ఈ కేసులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకున్నట్లు తేలింది.
ప్రేమ సంబంధం కారణంగా బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా ఉన్న యువకుడిని కోల్‌కతా హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో విచారణ తర్వాత తీర్పు వెలువరిస్తున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. పరస్పకర సమ్మితో లైంగికంగా కలిసిన కేసుల్లో పోక్సో చట్టంపై ఆందోళన వ్యక్తం చేసింది. అమ్మాయిలు, అబ్బాయిలకు ఈ సందర్భంగా పలు సూచనలు చేసింది. యుక్త వయసులో ఉన్న బాలికలు తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని చెప్పింది. రెండు నిమిషాల ఆనందం కోసం లొంగిపోతే సమాజంలో ఆమె విలువను కోల్పోతుందని వ్యాఖ్యానించింది. ఆమె శరీరం యోక్క సమగ్రతను ఆమె హక్కును రక్షించాలని.. ఆమె గౌరవాన్ని స్వీయ విలువను రక్షించాలని, గోప్యతను రక్షించుకోవాలని కోల్‌కతా కోర్టు సూచించింది.
అలాగే యుక్త వయసులో ఉన్న అబ్బాయిలకు కూడా కోర్టు పలు సూచనలు చేసింది. ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలని తెలిపింది. మంచి, చెడుల గురించి తెలియజేయాలని.. సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను గురించి నొక్కి చెప్పింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా మహిళలతో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచించింది.