ఎంపీలుగా తెలుగులో ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు
పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 1:30 PM ISTఎంపీలుగా తెలుగులో ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు
పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఎంపీగా పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తర్వాత కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు.. తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మోన్నీ మధ్యే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. శ్రీకాకుళం నుంచి మూడోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన.. ఇప్పుడు తొలిసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. గతంలో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందించారు. పిన్న వయసులో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకుని రికార్డు సృష్టించారు.
అయితే.. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. సికింద్రాబాద్ ఎంపీగా పార్లమెంట్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన కూడా తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తిరుగులేని విజయాలను అందుకుంటున్నారు. కాగా.. గత కేంద్ర కేబినెట్‌లో కూడా మంత్రిగా పనిచేశారు కిషన్‌రెడ్డి. మరోసారి ఆయన మోదీ కేబినెట్‌లో బాధ్యతలను తీసుకున్నారు. తాజాగా ఇవాళ తెలుగులో ఎంపీగా ప్రమాణం స్వీకారం చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
పార్లమెంట్‌లో తెలుగులో ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు pic.twitter.com/sCPUqGarOF
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 24, 2024
ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎంపీ కూడా ఇవాళ వార్తల్లో నిలిచారు. తొలిసారి విజయనగరం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన కిలిశెట్టి అప్పలనాయుడు.. సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు. ఆ తర్వాత లోక్‌సభ సమావేశాల్లో పాల్గొన్నారు.
తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లిన ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు pic.twitter.com/HCYSgnAFc9
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 24, 2024