వరకట్నం డిమాండ్‌తో పెళ్లి క్యాన్సిల్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కేరళలో విషాదం చోటుచేసుకుంది. వివాహం రద్దు కావడంతో వైద్య విద్యార్థిని తన ప్రాణాలు బలి తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 7 Dec 2023 2:15 PM ISTవరకట్నం డిమాండ్‌తో పెళ్లి క్యాన్సిల్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కేరళలో విషాదం చోటుచేసుకుంది. వివాహం రద్దు కావడంతో వైద్య విద్యార్థిని తన ప్రాణాలు బలి తీసుకుంది. షహానా అనే 26 ఏళ్ల యువతి తిరువనంతపురంలోని మెడికల్ కాలేజ్‌లో పీజీ చదువుతోంది. ఈమె తన క్లాస్‌మేట్‌ను వివాహం చేసుకోవాలని చూసింది. అందుకు అందరూ ఒకే అని మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ.. అబ్బాయి తరఫు వారు భారీగా వరకట్నం డిమాండ్ చేశారు. దాంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. తీవ్ర మనోవేదన చెందిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
పెళ్లి కొడుకువారు వరకట్నంలో భాగంగా బంగారం, భూమితో పాటు బీఎండబ్ల్యూ కారు రూపంలో భారీగా వరకట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతి తల్లిదండ్రులు తాము అంత పెద్దమొత్తంలో ఇచ్చుకోలేమని అన్నారు. షహానా కుటుంబం తాము అడిగిన కట్నం ఇవ్వనందుకు.. వివాహం క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. దాంతో.. షహానా తీవ్ర మనస్థాపానికి గురైంది. అపార్ట్‌మెంట్‌లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉదయమే ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు షహానా ఒక సూసైడ్ లెటర్ కూడా రాసిపెట్టింది. అందరికీ డబ్బే కావాలీ.. అంటూ సూసూడ్‌లో రాసి ఆత్మహత్య చేసుకుంది.
షహానా మృతిపై మెడికల్ కాలేజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. షహానా చనిపోయిందన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనలో సమగ్ర విచారణ జరపాలని చెప్పారు. అలాగే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే.. బాధిత కుటుంబాన్ని కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సతీదేవి పరామర్శించారు. మరోవైపు వరకట్నం కోసం వేధింపుల ఆరోపనలు ఎదుర్కొంటున్న వైద్యుడిని.. మెడికల్ పీజీ డాక్ట్ర్స్ అసోసియేషన్ బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిపారు.