విషాదాన్ని నింపిన మండి బిర్యానీ, మహిళ మృతి.. మరో 178 మందికి..

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు.

By Srikanth Gundamalla  Published on  29 May 2024 1:43 AM GMT
kerala, food poison, woman dead, biryani,

 విషాదాన్ని నింపిన మండి బిర్యానీ, మహిళ మృతి.. మరో 178 మందికి.. 

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. వీకెండ్స్‌.. ఇక బయటకు వెళ్లినప్పుడు చాలా మంది తినడానికి ప్రిఫర్ చేసేది బిర్యానీనే. ఒక బిర్యానీలో మండి బిర్యానీ అంటూ వచ్చింది. దీనికి కూడా ఆదరణ బాగానే పెరిగింది. జనాలు దీన్ని ఇష్టంగా తిటుంటారు. ఒకే ప్లేట్‌లో ముగ్గురు.. నలుగురు తినేలా మండి రెడీ చేస్తారు. అయితే.. కేరళలోని ఓ మండి రెస్టారెంట్‌లో కూడా కొందరు బిర్యానీ తిన్నారు. అయితే.. వారికి ఫుడ్‌పాయిజన్ అయ్యింది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో 170 మందికి పైగా అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. త్రిసూర్ జిల్లాలోని పెరింజనం నగరంలో ఈ ఘటన జరిగింది.

కుటిలక్కడవ్‌కి చెందిన నుసైబా (56) అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి పెరింజనంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ వారితో కలిసి మండి బిర్యానీ తిన్నది. అయితే.. బిర్యానీ తిన్న తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో.. ఆమెను బంధువులు స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇరింజలకుడలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెడికల్ కాలేజ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈక్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. ఇక పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఫుడ్‌ పాయిజన్ అయిందనీ పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు, ఫుడ్‌సేఫ్టీ డిపార్ట్‌మంట్‌ సహా ఇతర అధికారులు సదురు రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో అపరిశుభ్రతతో హోటల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు బిర్యానీ తిని మరో 170 మంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఇందులో కొందరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారిని కలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు సమాచారాన్ని సేకరించారు. రెస్టారెంట్‌లోని మయోనీస్, కేరళలో ప్రసిద్ధి చెందిన బిర్యానీ లాంటి యెమెన్ వంటకం ‘కుజి మండి’ తినడంవల్లే మహిళ మరణించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పెరింజనం, కయపమంగళానికి చెందినవారుగా అధికారులు చెప్పారు.

Next Story