తప్పిన ప్రమాదం.. ల్యాండింగ్‌కు ముందు గాల్లో గిరగిరా తిరిగిన హెలికాప్టర్
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది
By Srikanth Gundamalla Published on 24 May 2024 1:02 PM ISTతప్పిన ప్రమాదం.. ల్యాండింగ్‌కు ముందు గాల్లో గిరగిరా తిరిగిన హెలికాప్టర్
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. కొంత మంది భక్తులు కూర్చొన్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ ను ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. భక్తులను ఎక్కించుకున్న హెలికాప్టర్ ఎక్కువ దూరం వెళ్లలేదు. వెంటనే ల్యాండ్ చేయాలని వెనక్కి వచ్చారు. ఈ క్రమంలోనే సాంకేతిక లోపం కారణంగా సాఫీగా హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. హెలిప్యాడ్ వద్ద నేలను తాకడానికి ముందే గాల్లో గింగిరాలు తిరిగింది. దాంతో.. అక్కడే ఉన్న భక్తులంతా హెలికాప్టర్‌ను చూసి భయాందోళనకు గురయ్యారు.
అలా గాల్లో గిరగిరా తిరుగుతు హెలికాప్టర్ హెలిపాడ్ దగ్గరే ఉన్న ఓ గుంతలోకి వెళ్లిపోయింది. కానీ.. పైలట్లు చాకచక్యంగా వ్యవహించి చివరకు హెలికాప్టర్‌ను అదుపు చేశారు. గుంటలోనే సేఫ్‌గా ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఇక హెలికాప్టర్‌లో ఆ సమయంలో పైలట్ సహా ఏడుగురు ఉన్నట్లు తెలిసింది. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కాగా.. ఈ పెను ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాద సమయంలో భక్తులంతా దేవుడిని వేడుకున్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలను గాల్లో ఎగరడానికి ముందే చెక్ చేసుకోవాల్సిందని పలువురు చెబుతున్నారు. మరోవైపు కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ సేవ ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటోంది. గత 11 ఏళ్లలో కేదార్‌నాథ్‌లో 10 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాగా.. ఈ ప్రమాదం ఉదయం 7 గంటలకు జరిగినట్లు తెలిసింది.
ఇక మే 10వ తేదీ నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. చార్‌ధౄమ్ యాత్ర కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై మే 31వ తేదీ వరకు నిషేధం ఉంది. దీని కారణంగా రిషికేశ్-హరిద్వార్‌లో తమ రిజిస్ట్రేషన్ కోసం వారాల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఉన్నారు.
కేధార్నాథ్ బేస్ క్యాంప్ వద్ద హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 24, 2024
హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయంలో గాల్లో రెండు రౌండ్లు కొట్టిన హెలికాప్టర్
హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు pic.twitter.com/KFAgbLZSRp