యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల మూసివేత
Kedarnath and Yamunotri shrines to close for winter starting today.ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఉన్న యమునోత్రి,
By M.S.R Published on 6 Nov 2021 8:30 AM GMTఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలను మూసివేశారు. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల ద్వారాలను మూశారు. మళ్లీ ఆర్నెళ్ల తర్వాత చార్‌థామ్ యాత్రకు సంబంధించిన ఆలయాలు తెరుచుకుంటాయి. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ తలపులను పూజరులు వేశారు.
కరోనా ఆంక్షల నేపథ్యంలో చార్‌థామ్ యాత్రకు మొదటల్లో అనుమతి ఇవ్వలేదు. ఈ ఏడాది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆలయాలను తెరిచారు. శుక్రవారం నాడు ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో పర్యటించారు. అక్కడ ఆయన జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. మోదీ కేదారీశ్వరుడికి పూజలు చేశారు. ఆ తర్వాత ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 2013లో వరదల్లో దెబ్బతిన్న శంకరాచార్య సమాధిని పునరుద్దరించారు. కొత్తగా డిజైన్ చేసిన ఆది గురువు శంకరాచార్య విగ్రహం 12 అడుగులు ఉంది. బాబా కేదార్ ఆలయం వెనుక భాగంలో శంకరాచార్య సమాధి ఉంది. ఆ సమాధి పునరుద్దరణ పనులను స్వయంగా మోదీ సమీక్షిస్తున్నారు. 2019 నుంచి శంకరాచార్య విగ్రహ పునర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆదిశంకరాచార్య విగ్రహం సుమారు 35 టన్నుల బరువుతో నిర్మించారు.
శంకరాచార్య భక్తులు ఈ పుణ్య స్థలంలో ఆత్మ స్వరూపంలో హాజరైయ్యారన్నారు. దేశంలో ఉన్న అన్ని మఠాలు, జ్యోతిర్లింగ్ క్షేత్రాలు.. కేదార్‌నాథ్‌లో జరుగుతున్న శంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఉప్పెన తర్వాత కేదార్‌నాథ్‌ను మళ్లీ పునర్ నిర్మాణం చేపడుతారా అన్న సందేహాలు ప్రజల్లో ఉండేవని, కానీ తన మనసులో ఒక స్వరం ఎప్పుడూ కేదార్‌ను అభివృద్ధి చేయవచ్చని వినిపించేదని మోదీ అన్నారు. గడిచిన వందేళ్లలో వచ్చిన భక్తుల సంఖ్య కన్నా రాబోయే పదేళ్లలో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని మోదీ అన్నారు.