నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం.. ఈ మాసంలో ప్రత్యేక రోజులు ఇవే..

Karthika masam 2020 .. కార్తీక మాసం శివుడికి ప్రతీకర మాసం. అందుకే ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తారు

By సుభాష్  Published on  16 Nov 2020 4:50 AM GMT
నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం.. ఈ మాసంలో ప్రత్యేక రోజులు ఇవే..

కార్తీక మాసం శివుడికి ప్రతీకర మాసం. అందుకే ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తారు భక్తులు. కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభమైంది. కార్తీక మాసం ప్రారంభం రోజు సోమవారం రావడం విశేషం. ఈ కార్తీక మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి. అదే విధంగా ఈ మాసంలో ప్రత్యేక రోజులు ఇలా ఉన్నాయి.

నవంబర్‌ 16 కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త

నవంబర్ 18 బుధవారం నాగుల చవితి,

నవంబర్ 20 శుక్రవారం తుంగభద్ర పుష్కరములు ప్రారంభం,

నవంబర్ 21 శనివారం శ్రవణా నక్షత్ర కోటి దీపాల పూజ,

నవంబర్ 23 రెండో సోమవారం,

నవంబర్ 25 బుధవారం కార్తీక శుద్ధ ఏకాదశి,

నవంబర్ 26 గురువారం చిల్కు ద్వాదశి,

నవంబర్ 28 శనివారం శనిత్రయోదశి,

నవంబర్ 29 ఆదివారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం,

నవంబర్ 30 మూడవ కార్తీక సోమవారం, పౌర్ణమి,

డిసెంబర్ 4 శుక్రవారం సంకష్టహర చతుర్థి,

డిసెంబర్ 7 నాలుగవ సోమవారం,

డిసెంబర్ 10 గురువారం ఉపవాస ఏకాదశి,

డిసెంబర్ 11 శుక్రవారం గోవత్స ద్వాదశి,

డిసెంబర్ 12 శనివారం -శనిత్రయోదశి,

డిసెంబర్ 13 ఆదివారం మాసశివరాత్రి,

డిసెంబర్ 14 ఐదవ సోమవారం, అమావాస్య సోమవార వ్రతం,

డిసెంబర్ 15 పోలిస్వర్గం, కార్తీక మాసం పూజలు పూర్తి.

దీపారాధనతో సర్వపాపాలు హరించిపోతాయి

కాగా, ఈ మాసంలో దీపారాధన చేయడం వల్ల సర్వపాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకం. సోమవారం తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భోళాశంకరుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తలసీ పూసలను ధరించడం, ఒక్క పూట భోజనం చేయడం వంటి సంప్రరదాయాలను ఆచరిస్తారు ఈ మాసంలో. కాగా, నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

Next Story