సీఎం రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

Karnataka CM Yediyurappa’s political secretary attempts suicide .. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజకీయ

By సుభాష్  Published on  28 Nov 2020 7:23 AM GMT
సీఎం రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజకీయ కార్యదర్శి ఎన్‌ఆర్‌ సంతోష్ శుక్ర‌వారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశారు. త‌న ఇంట్లో నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు. దీంతో ఆయన్ను బెంగళూరులోని రామయ్య మెమోరియల్‌ ఆసుపత్రికి తరలించి.. వైద్యం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. దీనిపై ఆయ‌న భార్య జాహ్న‌వి మీడియాతో మాట్లాడారు. త‌న‌ భ‌ర్త సంతోష్‌కుమార్ శుక్ర‌వారం చాలా ఆందోళ‌న‌గా క‌నిపించారని చెప్పారు. "సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న మేడ‌పైకి వెళ్లారు. నేను డిన్న‌ర్‌కి ఎం వండాలో అడుగుదామ‌ని పైకి వెళ్లే సరికి.. ఆయ‌న బెడ్‌పై స్పృహాలో లేర‌ని.. వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకొచ్చామ‌ని" చెప్పారు.

కాగా.. తన రాజకీయ కార్యదర్శి ఆత్యహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం యెడియూరప్ప స్పందించారు. తాను సంతోష్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ప్రకటించారు. ఆయన ఎందుకు అలా చేసుకున్నాడనే విషయం తనకూ తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీలేదన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న సంతోష్‌ను సీఎం పరామర్శించారు.

Next Story
Share it