కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ భారతీయ జనతా పార్టీలో చేరారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. అయితే మే 13న ఎన్నికలు ముగిసే వరకు కిచ్చా సుదీప్ సినిమాల ప్రసారాన్ని నిషేధించాలని కోరుతూ శివమొగ్గకు చెందిన న్యాయవాది రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉటంకిస్తూ, శివమొగ్గ న్యాయవాది సుదీప్ సినిమాలు, షోలు నేరుగా ఓటర్ల మనస్సులపై ప్రభావం చూపుతాయని అన్నారు.
కర్నాటకలో చారిత్రాత్మక విజయం సాధించాలనే తపనతో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. పలువురు స్టార్ లను తమ ప్రచారం కోసం వాడుకుంటూ ఉంది. కర్నాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండేందుకు పలువురు కన్నడ నటులను సంప్రదించింది. ప్రస్తుతానికైతే కిచ్చా సుదీప్ తమ స్టార్ క్యాంపెయినర్ అని బీజేపీ అంటోంది. రాబోయే రోజుల్లో పలువురు స్టార్స్ తమ కోసం ప్రచారం చేస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు.