జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  9 Sept 2024 9:15 AM IST
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద సోమవారం చొరబాటుకు ప్రయత్నించారు ఇద్దరు ఉగ్రవాదులు. దాంతో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఆర్మీ జరిపిన కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.

సరిహద్దు జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో ఆదివారం, సోమవారం మధ్య రాత్రి సమయంలో సైన్యం చొరబాటు నిరోధక ఆపరేషన్ నిర్వహించిందని ఆర్మీ అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు ఏకే-47 రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో భారీ సెర్చ్‌ ఆపరేషన్ జరుగుతోందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. నౌషెరా సెక్టార్‌లో భారీ బందోబస్తు ఉంచామని అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో కొద్ది రోజుల నుంచి సెర్చ్‌ ఆపరేషన్లు.. భారీ ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాజౌరి జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన కొద్ది రోజులకే తాజా సంఘటన జరిగింది. సెప్టెంబరు 3న సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల బృందం ఆర్మీపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుండి పారిపోయారు. అయతే.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఆగస్టు చివరి వారంలో రాజౌరిలో లాఠీ ప్రాంతంలో అనుమానాస్పద ఉగ్రవాద స్థావరాన్ని ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నప్పుడు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. జూలైలో, అదే జిల్లాలోని గుండా ప్రాంతంలోని భద్రతా పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఒక జవాన్ గాయపడ్డాడు.

Next Story