జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదుల హతం
కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి రెండు వేర్వు సంఘటనల్లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 12:00 PM ISTజమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌లో గత కొన్నాళ్లుగా ఇండియన్ ఆర్మీ వరుసగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో ఉగ్రవాదులను మట్టుబెడుతోంది. ఉగ్రవాదులు కూడా రెచ్చిపోతున్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి రెండు వేర్వు సంఘటనల్లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సంఘటనల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.
మొదటగా కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాయి భద్రతా బలగాలు. అలాగే.. కుప్వారాలోని తంగ్‌ధర్ సెక్టార్‌లో కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఇక్కడ భద్రతా బలగాల కాల్పుల్లో మరో ఉగ్రవాది చనిపోయాడు. బుధవారం రాత్రి సమయంలో తంగ్‌ధర్ సెక్టార్‌లో ఉగ్రవాది కదలికలను గుర్తించిన బలగాలు వెంటనే అప్రమత్తం అయ్యాయి. ఆ తర్వాత అతని కోసం సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉగ్రవాదిని గుర్తించి కాల్చి చంపేశారు. మరోవైపు ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదుల కదలికలు కనిపించడంతో మచిల్ సెక్టార్‌లో కూడా 57 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు అప్రమత్తం అయ్యి ఆపరేషన్స్ చేపట్టింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తంగా ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రౌజరీ జిల్లాలోని లాటీ గ్రామంలో మరో సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోందని ఆర్మీ అధికారులు చెప్పారు. అక్కడ నలుగురు ఉగ్రవాదుడు దాక్కుని ఉన్నారన్న సమచారంతో సెర్చ్ ఆపరేష్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.