జమ్ముకశ్మర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  7 July 2024 7:33 AM IST
jammu Kashmir, encounter, 4 terrorists killed,

జమ్ముకశ్మర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఈ ఘటనల్లో భద్రతా దళాలకు చెందిన ఇద్దరి సిబ్బంది కన్నుమూశారు. అయితే.. టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో మోడెర్‌గ్రామ్‌ ప్రాంతంలో భద్రతాదళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దాంతో. గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తం అయిన బలగాలు కూడా తిరిగి కాల్పులను ప్రారంభించాయి. ఉగ్రవాదులను చుట్టుముట్టి ఎన్‌కౌంటర్‌ జరిపారు. ఈ క్రమంలోనే కనీసం అక్కడ ఇద్దరు టెర్రరిస్టులు హతం య్యారని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో లాన్స్‌నాయక్‌ ప్రదీప్‌ నయన్‌ కూడా మరణించాడని పోలీసులు తెలిపారు.

మరో చోట కూడా కాల్పులు జరిగాయి. లష్కర్‌ ఉగ్రవాదులు దాగిఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఫ్రిస్కల్‌ చిన్నిగమ్ గ్రామంలోకి వచ్చాయి. అక్కడ ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లోమరో ఇద్దరు టెర్రరిస్టులు హతం అయ్యాయి. సంఘటనాస్థలంలో ఒక రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవాల్దార్‌ రాజ్‌కుమార్ అనే జవాను కన్నుమూశాడు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాలను కశ్మీర్ ఐజీ వీకే బిర్దీ పరిశీలించారు. ఉగ్రవాద ఏరివేత చర్యలు ఇలానే కొనసాగుతాయంటూ హెచ్చరించారు.

Next Story