అలర్ట్.. IRCTCలో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలుకే!
ఇండియన్ రైల్వేస్‌లో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 7:15 AM ISTఅలర్ట్.. IRCTCలో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలుకే!
ఇండియన్ రైల్వేస్‌లో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఆన్‌లైన్ ద్వారా చాలా మంది ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్ ను సందర్శిస్తారు. చాలా మంది ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవారు స్నేహితులు, బంధువుల కోసం టికెట్ బుక్ చేస్తారు. అలాంటి వారిని రైల్వే అధికారులు అలర్ట్ చేస్తున్నారు.
ఇక నుంచి పర్సనల్ ఐడీ నుంచి ఇతరులకు ట్రైన్ టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. రైల్వే రిజర్వేషన్లపై కొత్త రూల్స్‌ను అమల్లోకి తెచ్చారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం అధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఖాతా ద్వారా ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే చిక్కుల్లో పడతారని అధికారులు చెబుతున్నారు. రూల్స్‌ను అధిగమించి ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే మాత్రం గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.10వేల వరకు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఐఆర్‌సీటీసీలో వ్యక్తిగత ఖాతాలు ఉన్నవారు రక్తసంబంధీకులు, ఒకే ఇంటిపేరుతో ఉన్నవారికి మాత్రమే టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. స్నేహితులు, ఇతరులకు ట్రైన్ టికెట్లను బుక్ చేస్తే చట్టపరంగా శిక్షకు అర్హులు అవుతారు. ఒక్కోసారి జైలుతో పాటు జరిమానా రెండూ పడే అవకాశాలు ఉంటాయంటున్నారు అధికారులు.
ఈ క్రమంలోనే రూల్స్‌ను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఐఆర్‌సీటీసీ, రైల్వే అధికారులు చెబుతున్నారు. తెలియకుండా రైల్వే టికెట్లను ఇతరుల కోసం బుక్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై ప్రయాణికులు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.