విమాన టికెట్లపై IRCTC ప్రత్యేక డిస్కౌంట్

విమానంలో ప్రయాణించేవారికి ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  27 Sept 2024 2:38 PM IST
విమాన టికెట్లపై IRCTC ప్రత్యేక డిస్కౌంట్

విమానంలో ప్రయాణించేవారికి ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 27వ తేదీన ఐఆర్‌సీటీసీ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే. తాజాగా 2024 ఏడాదితో ఐఆర్‌సీటీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.

IRCTC వెబ్‌సైట్ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఇండిగో విమాన టికెట్లపై 12 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఈ మేరకు IRCTC ఎక్స్‌ వేదికగా వివరాలను తెలిపింది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్‌ను విమాన ప్రయాణికులకు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఆ ప్రత్యేక డిస్కౌంట్‌ కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు ఆఫర్‌ను వినియోగించుకోవాని IRCTC సూచించింది. సెప్టెంబర్‌ 26 నుంచి 28తేదీ అర్ధరాత్రి వరకు 12 శాతం డిస్కౌంట్‌ ద్వారా ఇండిగో విమాన టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఇక ప్రయాణ వ్యవధిపైనా వివరాలను పొందుపర్చింది IRCTC. ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి 2025 మార్చి 31 వరకు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. చాలా కాలం వరకు విమాన ప్రయాణానికి సదుపాయం కల్పిస్తుండటంతో ప్రయాణికులు భారీగా ఈ డిస్కౌంట్‌ను పొందేందుకు ముందుకొస్తున్నారని తెలుస్తోంది.

అయితే.. ప్రత్యేక ఆఫర్‌ను పొందాలనుకుంటే IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా.. మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ముందుగా ఐఆర్‌సీటీసీ ఎయిర్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. ఫ్లైట్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎప్పుడు వెళ్లానుకుంటున్నారో వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత టికెట్‌కు అమౌంట్‌ పే చేస్తే సరిపోతుంది. అక్టోబర్ 3 ఉంచి 2025 మార్చి 31వ తేదీ లోపు మాత్రమే టికెట్‌ బుక్ చేసుకుంటే ఈ ఆఫర్‌ నేరుగా వర్తిస్తుంది. ఇక ఫోన్లో IRCTC ఎయిర్‌ ద్వారా కూడా ఇదే విధంగా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.



Next Story