లింగమార్పిడి చేయించుకుని స్నేహితురాలిని పెళ్లాడిన మహిళ

ఒక మహిళ తనలో తనకు పురుషుడి లక్షణాలు కనిపించాయి. కొంతకాలం ఎవరికీ చెప్పలేకపోయింది.

By Srikanth Gundamalla  Published on  12 Dec 2023 1:15 PM IST
Indore, woman, changes gender, married, friend,

లింగమార్పిడి చేయించుకుని స్నేహితురాలిని పెళ్లాడిన మహిళ

ఒక మహిళ తనలో తనకు పురుషుడి లక్షణాలు కనిపించాయి. కొంతకాలం ఎవరికీ చెప్పలేకపోయింది. కానీ.. ఇటీవల ధైర్యం చేసి లింగమార్పిడి చేయించుకుంది. ఆ తర్వాత గతంలో తన స్నేహితురాలు అయిన అమ్మాయినే వివాహం చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. ఈ వివాహానికి సంబందించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అల్కా సోని అనే మహిళ గత కొంత కాలంగా తాను స్త్రీ కాదు అని గ్రహించింది. అప్పటి నుంచి మగవాడిగానే జీవించడం మొదలుపెట్టింది. తన 47వ పుట్టినరోజున ధైర్యం చేసి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. పురుషుడిగా మారిన ఆమె పేరును కూడా అస్తిత్వ సోనిగా మార్చుకుంది. పూర్తిగా అబ్బాయిగా మారి కొత్త లైఫ్‌ను ప్రారంభించింది. అయితే.. 47 ఏళ్లు రావడంతో పెళ్లి చేసుకోవాలని భావించింది. చాలా కాలంగా స్నేహంగా ఉన్న ఆస్తాను వివాహం చేసుకోవాలని అనుకుని.. ఆమెను అడిగింది. దానికి ఆస్తా కూడా ఒప్పుకోవడంతో వీరి వివాహం ఫ్యామిలీ కోర్టులో జరిగింంది. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబాల తరఫున కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. ఇటీవలే వీరి పెళ్లి ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకున్నారు.

తాము వివాహం చేసుకోవడానికి ఇండోర్‌ కలెక్టర్‌ను కలిసి తమ పరిస్థితిని వివరించినట్లు వధువు ఆస్తా తెలిపింది. స్పెషల్‌ మ్యారేజ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించింది. అనుమతి లభించడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం వివాహం చేసుకున్నట్లు ఆస్తా చెప్పింది. మరోవైపు ట్రాన్స్‌ జెండర్స్‌ వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు అక్టోబర్‌ నెలలో కీలక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. రిలేషన్‌షిప్‌లో ఉన్న ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు వివాహం చేసుకోవచ్చని తెలిపింది.

Next Story