అయోధ్యకు మరో విమాన సర్వీసుని ప్రారంభించిన ఇండిగో
అయోధ్యకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో విమాన సర్వీసును ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 2:37 PM ISTఅయోధ్యకు మరో విమాన సర్వీసుని ప్రారంభించిన ఇండిగో
అయోధ్యకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో విమాన సర్వీసును ప్రారంభించింది. ఇండిగో ఎయిర్‌లైన్ అయోధ్య నుంచి అహ్మదాబాద్‌కు వాణిజ్య విమాన సర్వీసును మొదలుపెట్టింది. ఇండిగో విమానయాన సంస్థ ఈ కొత్త సర్వీసును కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. జనవరి 22న రామమండిర ప్రతిష్టాపన వేడుకకు ముందు ఇండిగో విమాన సర్వీసు ప్రారంభించింది. అయితే.. ఇప్పటి వరకు ప్రారంభించిన వాటిలో ఇది రెండోది. ఇప్పటికే ఇండిగో విమానయాన సంస్థ ఢిల్లీ-అయోధ్య మధ్య సర్వీసును ప్రారంభించింది. జనవరి 15వ తేదీ నుంచి ముంబై-అయోధ్య మార్గంలో మరో విమాన సర్వీసును కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే.. అహ్మదాబాద్-అయోధ్య మధ్య విమాన సర్వీసు వారానికి మూడ్రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మంగళవారం, శనివారం అయోధ్య-అహ్మదాబాద్ మధ్య విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇండిగో విమానయాన సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు.. ఇండిగో విమానం 6E 6375 అహ్మదాబాద్ నుండి ఉదయం 9:10 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 11 గంటల వరకు అయోధ్యకు చేరుకుంటుంది. ఇక ఆ తర్వాత ఇండిగో విమానం 6E 112 అయోధ్య నుండి ఉదయం 11:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఈ విమానంలో ఛార్జీలను కూడా వెల్లడించింది ఇండిగో సంస్థ. శనివారం అయోధ్య నుంచి అహ్మదాబాద్ మార్గంలో ప్రయాణించేందుకు రూ.4,276 ఛార్జీ చూపిస్తోంది. ఇక అహ్మదాబాద్ నుంచి అయోధ్య వెళ్లడానికి అయితే రూ.7,199 చూపిస్తోంది. రోజు సమయం, వస్తువులు లేదా ఇతర కారణాల వల్ల ఛార్జీల్లో పెరుగుదల లేదా తగ్గుదల సాధ్యమవుతాయని తెలుస్తోంది. టిక్కెట్ ధరలు, బుకింగ్ సమాచారం మరింత తెలుసుకోవాలంటే ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
జనవరి 22న అయోధ్యలో రామమండి ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 22న వంద చార్టెర్డ్ విమానాలు అయోధ్య ఎయిర్‌పోర్టులు ల్యాండ్ అవ్వనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. కాగా.. డిసెంబర్ 30న అయోధ్యలో మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.