విధుల్లో ఉండే రైల్వే పోలీసులూ టికెట్ తీసుకోవాలి: ఇండియన్ రైల్వే
భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. విధుల్లో ఉండే రైల్వే పోలీసులు కూడా ఇక నుంచి టికెట్ కొనాల్సిందే అని ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 3:09 AM GMTవిధుల్లో ఉండే రైల్వే పోలీసులూ టికెట్ తీసుకోవాలి: ఇండియన్ రైల్వే
భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. విధుల్లో ఉండే రైల్వే పోలీసులు కూడా ఇక నుంచి టికెట్ కొనాల్సిందే అని ప్రకటించింది. విధుల్లో భాగంగా రైళ్లలో ప్రయాణించే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది తప్పనిసరిగా డ్యూటీ కార్డ్ పాస్‌ని కలిగి ఉండాలని రైల్వే పేర్కొంది. లేదంటే తప్పనిసరిగా టికెట్‌ను కొనుగోలు చేయాల్సిందే అని పేర్కొంది. ఐడీ కార్డుతో ప్రయాణించి విధుల్లో ఉన్నానంటే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ఇండియన్ రైల్వే పేర్కొంది.
విధుల్లో ఉన్న సయమంలో ఓ కానిస్టేబుల్ రైలు నుంచి జరి పడిపడ్డానింటూ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. రైలు నుంచి కిందపడ్డప్పుడు కాలుని కోల్పోయానని పేర్కొన్నాడు. దీన్ని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. అతని వద్ద ట్రావెల్ అథారిటీ కానీ.. రైలు టికెట్ కానీ లేదని పేర్కొంది. అందుకే పరిహారం పొందలేడని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖకు అహ్మదాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. కాగా తరచూ రైలు ప్రయాణాలు చేసే ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బందికి డ్యూటీ కార్డ్ పాస్‌ల విషయంలో రైల్వే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని కోర్టు సీరియస్ అయ్యింది. సంబంధిత సర్క్యూలర్‌ను ఇంకా జారీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరగా సర్క్యూలర్‌ను జారీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది.
రాజేశ్ బగుల్ అనే జీఆర్‌పీ కానిస్టేబుల్ ప్రమాదం జరిగిన రోజున అధికారిక విధుల్లో ఉన్నట్లు పేర్కొన్నాడు. సూరత్-జామ్‌నగర్ ఇంటర్‌సిటీ రైలులో బరూచ్‌కి వెళ్తున్న సమయంలో రైలు నుంచి అనుకోకుండా కిందపడిపోయానని పేర్కొన్నాడు. దాంతో.. కాలుని మోకాలి పై వరకు తొలగించాల్సి వ్చిందన్నాడు. అయితే రాజేశ్ వాదనలను నిరూపించే డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు లేవని రైల్వే వాదించింది. సాక్ష్యాధారాలు కూడా లేకపోవడంతో అతని క్లెయిమ్‌ను తిరస్కరించారు.