సికింద్రాబాద్-ముంబై మార్గంలో తొలి స్లీపర్ వందేభారత్ రైలు..?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టు వందేభారత్.
By Srikanth Gundamalla Published on 12 July 2024 6:43 AM IST
సికింద్రాబాద్-ముంబై మార్గంలో తొలి స్లీపర్ వందేభారత్ రైలు..?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టు వందేభారత్. ఇందులో అత్యంత ఆధునిక సదుపాయాలు కల్పించారు. చాలా మార్గాల్లో నడుస్తోన్న ఈ ట్రైన్ ప్రజల ఆదరణ పొందింది. అయితే.. ఇందులో ఇప్పటి వరకు స్లీపర్ రైళ్లు అందుబాటులో లేవు. ఇప్పుడు వాటిని కూడా అందుబాటులోకి తెస్తోంది కేంద్ర ప్రబుత్వం. రైల్వే శాఖ దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతల వారీగా ప్రవేశెట్టేందుకు ప్రణాళికలు చేస్తోంది. మొదటగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ స్లీపర్ వందేభారత్ అందుబాటులోకి వస్తుందో అన్న ఆసక్తి అందర్లోనూ ఉంది.
భాగంగా.. ద.మ.రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్ - ముంబయి నగరాల మధ్య నడిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నగరాల మధ్య ఇప్పటి వరకు వందేభారత్ రైలు అందుబాటులో లేదు. ఈ కారణంగానే తొలి వందేభారత్ స్లీపర్ క్లాస్‌ను ఈ మార్గంలో నడపాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. ఈ మేరకు ద.మ. రైల్వే జోన్ .. రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్ల తెలిసింది.మరోవైపు సికింద్రాబాద్ - పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు (సిట్టింగ్) రానున్నట్లుసమాచారం.
తిరుపతి - నిజామాబాద్‌ల మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిజామాబాద్‌లో ప్లాట్‌ఫాం ఖాళీ లేక బోధన్‌కు తీసుకెళుతున్నారు. ప్రయాణ సమయానికి ముందు బోధన్ నుంచి నిజామాబాద్‌కు తీసుకువస్తున్నారు. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ - రాజ్‌కోట్‌ల మధ్య రాకపోకలు సాగిస్తోంది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందినవారు హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ రైలును కచ్ జిల్లా వరకు పొడిగించాలని కోరుతున్నారు. ఈ రెండు అంశాలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సమీక్షలో చర్చకు రావడంతో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకు, రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను కచ్ వరకు పొడిగించేందుకు రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు పంపిస్తామని ద.మ.రైల్వే జీఎం బదులిచ్చినట్లు తెలిసింది.