పాకిస్థాన్ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 6:27 AM GMTపాకిస్థాన్ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన 19 మంది పాకిస్థానీ నావికులతో కూడిన ఓడను కాపాడింది. తద్వారా 19మంది పాకిస్తాన్ నావికులను ఇండియన్ నేవీ కాపాడింది. కాగా.. రాన్ ఫిషింగ్ నౌకను కాపాడిన తర్వాత ఐఎన్‌ఎస్ సముత్ర చేపట్టిన మరో ఆపరేషన్ ఇది.
ఆల్ నయీమి అనే పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియాకు చెందిన 11 మంది దుండుగులు దాడులకు తెగబడ్డారు. అరేబియా సముద్రంలో ఈ సంఘటన జరిగింది. కొచ్చి పశ్చిమాన సుమారు 800 నాటికల్ మైల్స్ దూరంలో పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియా సముద్రపు దొంగలు దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత వారి ఓడతో పాటు.. 19 మంది పాకిస్థానీ నావికులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ వెంటనే అప్రమత్తం అయ్యింది. ఆ తర్వాత రంగంలోకి దిగింది. ఐఎన్‌ఎస్ సమిత్ర యుద్ధ నౌకలోని సిబ్బందికి సమాచారం పంపి వారిని రంగంలోకి దింపింది.
ఈ మేరకు సముద్రంలోకి వెళ్లి సోమాలియాకు చెందిన దొంగల ఆచూకీని కనిపెట్టారు ఇండియన్ నేవీ అధికారులు. ఆ తర్వాత వారి నౌక వద్దకు వెళ్లి కాపాడారు. పాకిస్థాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజాకర్ల నుంచి ఐఎన్‌ఎస్ సుమిత్రా సిబ్బంది కాపాడారని ఇండియన్ నేవీ ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా.. అంతకుముందు ఇరాన్‌కు చెందిన ఓ ఫిషింగ్ నౌకను కూడా ఇండియన్ నేవీ సిబ్బంది సోమవారం రక్షించారు. ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలే హైజాక్ చేశారు. రంగంలోకి దిగిన ఐఎన్‌ఎస్ సుమిత్రా 17 మంది ఇరాన్ దేశీయులను కాపాడింది.