ఆధార్ తరహాలో విద్యార్థులకు 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ'

ఆధార్‌ తరహాలోనే దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం.

By Srikanth Gundamalla  Published on  16 Oct 2023 4:46 AM GMT
india govt, one nation one ID,  apaar,

ఆధార్ తరహాలో విద్యార్థులకు 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ' 

దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కంపల్సరీగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర పనుల్లో ఆధార్‌ను కంపల్సరీగా చేసేశాయి ప్రభుత్వాలు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కసరత్తు చేస్తోంది. ఆధార్‌ తరహాలోనే దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ' తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది. ఈ నేపత్యంలో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ స్కూల్‌ విద్యార్థులకు ఇచ్చే ఈ గుర్తింపు కార్డు నెంబర్‌ను ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (APAAR-అపార్‌)గా పిలుస్తున్నారు. అపార్‌ ఐడీ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశించింది.

అపార్‌ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్‌ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. దీంట్లో విద్యార్థి అకడమిక్‌ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తం అయ్యి ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్‌ చేయొచ్చని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అయితే.. విద్యార్థులకు కొత్త అపార్‌ గుర్తింపు జారీకి సంబంధించి తల్లిదండ్రులతో మాట్లాడాలని.. వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఇక ఈ అపార్‌ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. అక్టోబర్ 16-18 మధ్య తల్లిదండ్రులు, ఉపాద్యాయులతో సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే.. ఈ ఐడీకి ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా సరే దాన్ని ఉపసంహరించుకోవచ్చని కూడా కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

ఇక విద్యార్థులకు సంబంధించిన డాటాకు సంబంధించి అనుమానాలు అవసరం లేదని.. రహస్యంగా ఉంటుందని చెబుతోంది కేంద్ర విద్యాశాఖ. ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం జరుగుతుందని చెబుతోంది. 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ' స్కీమ్‌పై ఏఐసీటీఈ చైర్మన్‌ టీజీ సీతీరామన్‌ స్పందించారు. ఆపార్‌ దేశంలోని విద్యార్థులకు క్యూఆర్‌ కోడ్‌ మాదిరగా పనిచేస్తుందని చెప్పారు. విద్యార్థుల సంబంధించిన ప్రతి నైపుణ్యం.. సాధించిన విజయం అందులో ఉంటుందని అన్నారు.

Next Story