ఢిల్లీ: దేశంలో 97 లక్షలు దాటేసిన కరోనా కేసులు

India Corona cases .. దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

By సుభాష్  Published on  8 Dec 2020 12:39 PM IST
ఢిల్లీ: దేశంలో 97 లక్షలు దాటేసిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..సోమవారం దేశంలో 10,26,399 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 26,567 కొత్త కేసులు నమోదయ్యాయి. జులై 10 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. నవంబర్ 17న 30 వేల లోపు పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ, ఆ సంఖ్య 29,163గా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 97 లక్షల మార్కును దాటేసింది. 97,03,770 మందికి ఈ వైరస్ సోకింది.

కాగా, ప్రస్తుతం దేశంలో 3,83,866 యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు, 91,78,946 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. అయితే, గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు దేశంలో మరణాల సంఖ్య 1,40,958కు చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 94.59 శాతం ఉండగా, మరణాల రేటు 1.45 శాతం ఉందని మంగళారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.

కాగా, మంగళవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ 15 వేల కంటే తక్కువ క్రియాశీల కేసులున్న 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన గ్రాఫ్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. అతి తక్కువగా 14 క్రియాశీల కేసులతో దామన్, డయ్యూ, దాద్రానగర్‌ మొదటి వరసలో ఉండగా..గుజరాత్‌లో 14,695 కేసులున్నాయి.



Next Story