దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 45,576 పాజిటివ్‌ కేసులు

India corona cases.. భారత్‌ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో మొత్తం ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 89 లక్షల

By సుభాష్  Published on  19 Nov 2020 6:54 AM GMT
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 45,576 పాజిటివ్‌ కేసులు

భారత్‌ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో మొత్తం ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 89 లక్షల 58వేలుదాటాయి. గడిచిన 24 గంటల్లో 45,576 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 585 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,58,483కు చేరగా, మృతుల సంఖ్య 1,31,578కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,43,303 యాక్టివ్‌ కేసులుండగా, గడిచిన 24 గంటల్లోనే 44,493 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 83,83,602 మంది కోలుకున్నట్లు తెలిపింది. ఇక దేశంలో రికవరీ రేటు 93.58 శాతం ఉండగా, మరణాల రేటు 1.47శాతానికి చేరింది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 4.95శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది

Next Story
Share it