ఆ ఐదు జిల్లాల్లో సినిమా థియేటర్లను మూసివేయించిన రాష్ట్ర ప్రభుత్వం
Haryana shuts cinema halls in 5 districts.దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. దీంతో
By M.S.R Published on 2 Jan 2022 2:15 PM ISTదేశంలో పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమవుతూ ఉన్నారు. కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు. ఓమిక్రాన్ భయాలు ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. ఇక హర్యానా రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్ ను మూసివేసింది. కేసులు అధికంగా రికార్డవుతున్న గుర్‌గ్రామ్, ఫరీదాబాద్, అంబాలా, పంచకుల, సోనిపట్ జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. జనవరి 2 నుంచి పది రోజులపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. మాల్స్, మార్కెట్లను సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని స్పష్టం చేసింది. బార్లు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని తెలిపింది.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. హర్యానాలో శుక్రవారం ఓమిక్రాన్ వేరియంట్ కు సంబందించి 26 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 63కి పెరిగింది. మొత్తం కేసుల్లో 23 యాక్టివ్‌గా ఉండగా, ఇతరులు డిశ్చార్జ్ అయ్యారని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
Breaking News: हरियाणा सरकार ने कोविड 19 की रोकथाम के मद्देनज़र पॉंच जिलों में सिनेमा हॉल, थियेटर, स्कूल, कॉलेज, जिम इत्यादि को बंद करने के आदेश दिए, कार्यालय 50% हाज़िरी के साथ काम करेंगे, 12 जनवरी तक बढ़ाई गई महामारी अलर्ट सुरक्षित हरियाणा की अवधि pic.twitter.com/cryTfOfeYM
— DPR Haryana (@DiprHaryana) January 1, 2022