పెళ్లికాని వారికి త్వరలోనే పెన్షన్.. ఎక్కడో తెలుసా..!
పెళ్లికాని వారికి పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్.
By Srikanth Gundamalla Published on 3 July 2023 3:58 PM ISTపెళ్లికాని వారికి త్వరలోనే పెన్షన్.. ఎక్కడో తెలుసా..!
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వృద్ధులకు, దివ్యాంగులకు.. వితంతువులకు కూడా పెన్షన్లు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ.. హర్యానా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పెళ్లికాని 45 నుంచి 60 ఏళ్ల వయసు వారికి పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. అంతేకాదు.. నెల రోజుల్లో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్.
అయితే.. జూలై 2న కర్నాల్‌లో జరిగిన జన్ సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడాడు. అతనికి 60 ఏళ్ల వయసు ఉంటుంది. పెన్షన్ దరఖాస్తు విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన చెందాడు. అయితే.. దీనిపై మాట్లాడిన సీఎం మనోమర్ లాల్ ఖట్టర్.. 45 ఏళ్లు పైబడిన వివాహం కాని మహిళలు, పురుషులకు నెలవారీ పెన్షన్ ఇచ్చేలా కొత్త పథకం తెస్తున్నట్లు ప్రకటించారు. దీనికోసం సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. నెలరోజుల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వెల్లడించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఇక వృద్ధ్యాప్య పెన్షన్‌ను కూడా వచ్చే ఆరు నెలల్లో రూ.3 వేలకు పెంచామని చెప్పారు. కాగా.. పథకం అర్హత, ఇతర వివరాలను సీఎం మనోహర్‌లాల్ వెల్లడించలేదు. ఎంత డబ్బు ఇస్తారనేదానిపై కూడా స్పష్టత లేదు.ప్రస్తుతం సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా దగ్గర కూడా ఇలాంటి పథకం తెస్తే బాగుటుందని సింగిల్స్ కామెంట్స్ చేస్తున్నారు.