కారు టైర్ మారుస్తుండగా ఢీకొట్టిన మరో కారు, ఆరుగురు దుర్మరణం
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 11 March 2024 10:48 AM ISTకారు టైర్ మారుస్తుండగా ఢీకొట్టిన మరో కారు, ఆరుగురు దుర్మరణం
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు టైర్ పంచర్ కావడంతో మార్చుకునేందుకు వాహనాన్ని రోడ్డుపక్కన ఆపారు. అయితే.. అంతలోనే ప్రమాదం వారిపైకి దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన మరో కారు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘోర ప్రమాదం ఆదివారం రాత్రి హర్యానాలోని రేవారి ప్రాంతంలో చోటుచేసుకుంది. సాని గ్రామంలో గవర్నమెంట్ పాఠశాల దగ్గర కొందరు రోడ్డు పక్కన కారు టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో.. ఆ కారులోని వారు వాహనాన్ని రోడ్డు పక్కకే ఆపారు. ఆ తర్వాత టైర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చీకట్లో వేగంగా మరో కారు దూసుకొచ్చింది. కారు నిలిపి ఉండటాన్ని గమనించకుడా దాన్ని ఢీకొట్టారు. దాంతో.. ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టడంతో బోల్తా పడింది.
ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. బాధితులు ఢిల్లీలోని కథు విలేజ్ నుంచి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
#WATCH | Haryana | Six people died, six injured in a road accident in Rewari last night. The incident occurred when the occupants of the car were changing its tyres and were hit by another car coming from behind. pic.twitter.com/0naO2WsdPy
— ANI (@ANI) March 11, 2024