వరుడు పెట్టిన ఒకే ముద్దు.. రణరంగంలా మారిన పెళ్లి పందిరి

కల్యాణ వేదికపై వరుడు చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోయారు.

By Srikanth Gundamalla  Published on  23 May 2024 6:30 PM IST
groom, kiss, bride,  stage, fight,

 వరుడు పెట్టిన ఒకే ముద్దు.. రణరంగంలా మారిన పెళ్లి పందిరి

కల్యాణ వేదికపై వరుడు చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కల్యాణ వేదిక అంతా రణరంగంలా మారింది. వధువు మెడలో వరమాల వేసిన తర్వాత వరుడు ఆమెకు ముద్దు పెట్టడమే దీనికి కారణమైంది. ఈ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

యూపీలోని హాపూర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహం ఒకేరోజు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సంబంధాలు చూసి.. ఒకే చేసుకున్నాడు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఇద్దరు కుమార్తెల వివాహం ఒకే రోజు అయినా కూడా సమయం మాత్రం వేర్వేరు. కొద్ది నిమిషాలు మాత్రమే తేడా ఉంటడంతో ఇది కూడా తమ మంచికే అనుకున్నారు. ఇక మొదట ఒక కుమార్తె వివాహం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అక్కడే మరో కుమార్తె వివాహం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే వరమాల క్రతువు పూర్తయింది. ఆ తర్వాత వరుడు.. వధువుకి అందరి ఉందే ముద్దు పెట్టాడు. వరుడు చేసిన పని వధువుతో పాటు ఆమె బంధువులకు నచ్చలేదు. వధువు సీరియస్‌ అయ్యింది. ఆ తర్వాత మెల్లిగా బంధువులు కూడా కల్యాణ వేదికపైగా వచ్చారు.

వధువు తరఫు బంధువులు, వరుడు తరఫు బంధువులు ఒక్కసారిగా స్టేజ్‌పైకి చేరుకున్నారు. వరుడిపై వధువు బంధువులు దాడి చేయడంతో గొడవ పెద్దది అయ్యింది. ఇరు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. కర్రలతో బాదుకున్నారు. కల్యాణ వేదిక కాస్త.. యుద్ధ వేదికలా మారిపోయింది. ఇక ఈ ఘర్షణ గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల వారిని అడ్డుకున్నారు. ఈ సంఘటనలో గాయపడ్డ ఏడుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ఇక వధువు వద్దని వారిస్తున్నా వరుడు ముద్దు పెట్టాడని అమ్మాయి తరఫు బంధువులు ఆరోపించారు. మరోవైపు ఆమె అంగీకారంతోనే తమ కుమారుడు అలా చేశాడని వరుడు కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే.. ఈ సంఘటనపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కానీ.. ప్రజాశాంతికి భంగం కలిగించినందుకు ఆరుగురిపై మాత్రం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని చెప్పారు.

Next Story