మట్టిలో పూడ్చిన 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం
ఇండో-బంగ్లాదేశ్ బార్డర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దట్టమైన అడవిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Sept 2023 7:45 PM ISTమట్టిలో పూడ్చిన 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం
ఇండో-బంగ్లాదేశ్ బార్డర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. పశ్చిమ బెంగాల్‌లోని నైడా అటవీ ప్రాంతంలో డీఆర్ఎస్, బీఎస్ఎఫ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిరక్వహించారు. ఊహించని విధంగా దట్టమైన అడవిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కొందరు అక్రమంగా బంగారం తరలిస్తున్నారనే సమాచారం అందింది. దాంతో.. కాపు కాసిన డీఆర్ఐ, బీఎస్ఎఫ్ అధికారులు స్మగ్లర్లను పట్టుకున్నారు. అయితే.. అప్పటికే అధికారులు సోదాలు చేస్తున్నారనే సమాచారం తెలియడంతో.. స్మగ్లర్లు అప్రమత్తం అయ్యారు. వారి వద్ద ఉన్న బంగారాన్ని అడవిలో పాతిపెట్టారు. ఇక విచారణలో ఈ విషయం తెలియడంతో డీఆర్ఐ, బీఎస్ఎఫ్ అధికారులు నైడా అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికారులకు ఊహించని విధంగా బంగారం లభ్యం అయ్యింది.
సోదాలు చేస్తుండగా ఒక చోట మట్టి అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో.. అక్కడ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ గుంత తవ్వి మట్టి కింద అక్రమంగా బంగారం దాచారని అధికారులు చెప్పారు. అయితే.. పట్టుబడ్డ బంగారు బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక విలు రూ.8.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బంగారం అక్రమ తరలింపు వ్యవహారంలో కీలకంగా వ్యవహిరంచిన వ్యక్తితో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.