పండగలు జరుపుకోవడం కంటే ప్రాణాలే ముఖ్యమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే దీపావళి పండగ రోజున బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం మనం కరోనా వైరస్‌తో పోరాడుతున్నామని, ఇలాంటి సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడం మన కనీస బాధ్యత అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మన సంప్రదాయ పండలు ప్రధానమైనప్పటికీ , ఇదే సమయంలోప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కూడా ముఖ్యమేనని పేర్కొంది. ఇలాంటి సమయంలో అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని తెలిపింది. బాణాసంచాపై నిషేధం విధించాలంటూ పశ్చిమబెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పున సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం దానిని తోసి పుచ్చింది.