ఫాస్టాగ్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు: NHAI
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 5:39 PM ISTఫాస్టాగ్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు: NHAI
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు గడువుని మరో నెల రోజులు పాటు పొడిగింది. ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటించింది NHAI. కాగా.. ఫిబ్రవి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశాన్ని కల్పించింది. మరోవైపు అప్పటి వరకు కూడా కేవైసీ చేయని వాటిని డీయాక్టివేట్ చేస్తామని వెల్లడించింది. ఫాస్ట్ ఈ -కేవైసీ వెబ్‌సైట్‌తో పాటు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) వెబ్‌సైట్ ద్వారా కూడా కేవేసీ చేసుకోవచ్చిన వివరించింది. కాగా.. జనవరి 31 వరకే ఈ-కేవైసీ గడువు ముగియగా.. తాజాగా దాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది NHAI.
ఫాస్టాగ్ ఈ-కేవైసీ పూర్తి చేసుకోండిలా...
ముందుగా ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ తెలుసుకోవడానికి వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. డ్యాష్‌బోర్డులోకి వెళ్లి 'మై ప్రొఫైల్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. కేవైసీ పూర్తి కాకపోయి ఉంటే అడిగిన వివరాలను ఎంటర్ చేసి ప్రాసెస్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎన్‌హెచ్‌ఏఐ వద్ద రిజిస్టర్ కాకుంటే.. 'మై ఫాస్టాగ్' యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాంకులు జారీ చేసిన ఫాస్టాగ్‌లు అయితే బ్యాంచ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. తద్వారా ఫాస్టాగ్ ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.