అమెజాన్‌లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు.. కేంద్రం నోటీసులు

అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  20 Jan 2024 4:52 AM GMT
Fake Prasadam,  Ayodhya,  amazon,

అమెజాన్‌లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు.. కేంద్రం నోటీసులు  

అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేలమంది ప్రముఖుకు ఆహ్వానాలు అందాయి. కాగా.. రామమందిరం ప్రారంభోత్సవం జరక్కముందే.. కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. అమెజాన్‌లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదాన్ని అమ్మకానికి పెట్టారు. ఈ చర్య ప్రస్తుతం కలకలం రేపుతోంది.

అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్‌లో ప్రసాదాల అమ్మకాలు మొదలుపెట్టింది. దాంతో.. అయోధ్య లడ్డూల కోసం పెద్ద ఎత్తున భక్తులు ఆర్డర్లు పెట్టారు. అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీ ఇలాంటి ఫేక్ ప్రసాదాలు అమ్ముతుండటంతో సంచలనంగా మారింది. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టనే ఇంకా జరగలేదు. మరో రెండ్రోజలు సమయం ఉన్నప్పుడే ప్రసాదాల అమ్మకాలకు తెర లేపుతున్నారు. అదికూడా అమెజాన్‌లో ఆర్డర్లకు అవకాశం ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు స్పందించారు. వేల ఆర్డర్లు పెట్టడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమెజాన్‌ ఫ్రాడ్‌ను గమనించిన కేంద్రం దీనిపై నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కు ఫిర్యాదు చేసింది. ఈవిషయం పై రంగంలోని దిగిన అధికారులు అమెజాన్ కు సెంట్రల్ కన్సుమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీ చేసింది.

అయోధ్య రామ మందిర్ ప్రసాదం ముసుగులో అమెజాన్ మిఠాయిల అమ్మకాలతో కూడిన మోసపూరిత వ్యాపార పద్ధతులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సిఎఐటి చేసిన ప్రాతినిథ్యం ఆధారంగా చర్య తీసుకుంది. ఏడు రోజుల్లోగా అమెజాన్ రిప్లై ఇవ్వాలని సీసీపీఏ సూచించింది. 2019 నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా.. అయోద్య ప్రసాదం, విభూది, హారం, అక్షింతలు అంటూ ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపితే నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరగలేదని.. ముందే ప్రసాద విక్రయాలు ఎలా జరుపుతారని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, భక్తులు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story