ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

By Srikanth Gundamalla  Published on  17 March 2024 11:18 AM IST
election commission,  india, vote register,

ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం 

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడంపై ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే.. గత ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు అవకాశం కల్పించారు.

ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చిని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం పారం-8 అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా లేదా నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయవచ్చు. ఎన్నికల సహాయ అధికారి, పోలింగ్ కేంద్రం అధికారి కూడా ప్రత్యక్షంగా దరఖాస్తు అందజేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వివరాలను కూడా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెఇపారు. కాగా.. ఓటు నమోదు ప్రక్రియ ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఉంటుందని చెప్పారు. కాగా.. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పిస్తోంది. https://nvsp.in, https://ceotelangana.nic.in వెబ్‌సైట్లపై ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Next Story