కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం
కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు.
By Srikanth Gundamalla
కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం
కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞనేశ్ కుమార్‌లను నియమించారు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ సంబంధించి ఎంపిక ప్రక్రియను చేపట్టింది. కాగా ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అరుణ్ కుమార్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. తాజాగా ఆ పదవులనే భర్తీ చేశారు.
దేశంలో మరికొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించి ముగ్గురు సభ్యుల కమిషన్ ప్యానెల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్‌లు ఉంటారు. రెండు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో వెంటనే వాటిని భర్తీచేయాల్సి వచ్చింది. ఇద్దరు కమిషనర్ల ఎంపిక కోసం ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంత్రి, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు. గురువారం మోదీ అధ్యక్షతన ఎలక్షన్ కమిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇద్దరు కమిషనర్లను ఎంపిక చేశారు. సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞనేశ్ కుమార్‌లను కేంద్ర ఎన్నికల కమిషనర్లగా నియామకం అయ్యారు.
వీరి నియామకానికి ముందు కేంద్ర ఎన్నికల సంఘంలో రాజీవ్ కుమార్ ఒక్కరే ఈసీఐలో మిగిలారు. తాజాగా మరో ఇద్దరు చేరడంతో ముగ్గురికి చేరింది కమిషనర్ల సంఖ్య. ఇక రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు.