ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో పలుచోట్ల అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది.

By Srikanth Gundamalla
Published on : 10 Jun 2024 3:18 PM IST

election commission of india, 13 assembly constituency, by-election,

ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల 

కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో పలుచోట్ల అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. బీహార్‌, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌లోని అభ్యర్థుల రాజీనామా, మరణాలతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక ఆ 13 నియోజవకర్గాలకు జులై 10వ తేదీన ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అయ్యింది. ఈ మేరకు షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు అధికారులు.

13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే..

బీహార్‌లోని రుపాలీ, బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌, రణఘాట్ దిక్షణ్ (ఎస్సీ), బాగ్దా(ఎస్సీ), మాణిక్తలా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మధ్యప్రదేశ్‌లోని అమర్వారా (ఎస్టీ), ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్, మంగౌర్, తమిళనాడులోని విక్రవాండి, పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ (ఎస్సీ)తో పాటు హిమాచల్‌లోని హమీర్పూర్‌, నలాగర్ నియోజకవర్గాలకు ఉపఎన్నిక జులై 10వ తేదీన నిర్వహించనుంది ఈసీ.

ఈ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నిక కోసం ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక నామినేషన్ల స్వీకరణకు ఆఖరి గడువు ఈ నెల 21వ తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత 24వ తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉండనుంది. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువుని 26వ తేదీగా చెప్పారు ఈసీ అధికారులు. ఇక జులై 10వ తేదీన ఒకేసారి 13 అసెంబ్లీలకు ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు ఆ తర్వాత జులై 13వ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.

Next Story