ఈసీఐ కీలక నిర్ణయం..అక్కడ పోలింగ్ తేదీ మార్పు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ మారుస్తూ ప్రకటన చేసింది.

By Srikanth Gundamalla  Published on  11 Oct 2023 12:00 PM GMT
ECI, change, rajasthan assembly, polling date,

ఈసీఐ కీలక నిర్ణయం..అక్కడ పోలింగ్ తేదీ మార్పు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీలో మార్పులు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే.. నవంబర్‌ 23న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను.. నవంబర్‌ 25వ తేఈకి మారుస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా.

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు అక్టోబర్‌ 9న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం అయితే రాజస్థాన్‌లో ఎన్నికల పోలింగ్ నవంబర్‌ 23న (గురువారం) రోజున జరగాల్సి ఉంది. అయితే.. ఆ తేదీన రాజస్థాన్‌లో పెద్ద సంఖ్యలో వివాహాలు, శుభకార్యాలతో పాటు సామాజిక కార్యక్రమాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో.. ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని ఈసీఐ భావించింది. అంతేకాదు.. పోలింగ్‌ శాతం కూడా తగ్గే అవకాశం ఉందని భావించింది. రవాణా సమస్యలు తలెత్తె చాన్స్‌ ఉందని పోలింగ్‌కు ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు..పలు రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంస్థల నుంచి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు కూడా అందాయట. ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలంటూ పలువురు విజ్ఞప్తి చేశారని ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఎన్నికల పోలింగ్‌ తేదీని మారుస్తూ ప్రకటన విడుల చేసింది. దాంతో.. రాజస్థాన్‌లో పోలింగ్‌ తేదీని మార్చింది. నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌.. 25వ తేదీన నిర్వహించాలని చెప్పింది. ఇక ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలు మాత్రం యథావిధిగా డిసెంబర్‌ 3వ తేదీనే వెలువడతాయని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Next Story