యువతి తలలో సర్జికల్ సూది మర్చిపోయిన డాక్టర్.. చివరకు..

అప్పుడప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆపరేషన్లు చేయడం వల్ల.. రోగుల ప్రాణాల మీదకు వస్తుంది.

By Srikanth Gundamalla  Published on  30 Sept 2024 7:30 PM IST
యువతి తలలో సర్జికల్ సూది మర్చిపోయిన డాక్టర్.. చివరకు..

అప్పుడప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆపరేషన్లు చేయడం వల్ల.. రోగుల ప్రాణాల మీదకు వస్తుంది. కడుపులో కత్తెరమర్చిపోవడం సహా ఇతరత్రా వస్తువులు పెట్టి కుట్లు వేసిన సంఘటనలు చాలా చూశాం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తలకు గాయం కారణం ఆస్పత్రికి వెళ్తే.. చికిత్స చేసిన వైద్యుడు సర్జికల్ సూదిని తలలో పెట్టే కుట్లు వేసేశాడు. ఆమెకు తలనొప్పి ఎక్కుగా రావడంతో పెద్దాస్పత్రికి వెళ్తే అప్పుడు అసలు విషయం బయటపడింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 18 ఏళ్ల యువతిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రికి వెళ్లి ఆమె చికిత్స చేయించారు. తలకు కుట్లు వేసి పంపించేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు తలనొప్పి తీవ్రంగా మారింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కాన్ చేశారు. ఆ తర్వాత తలలో ఏదో ఉందని గుర్తించి.. చికిత్స చేశారు. ఆమె తల నుంచి సర్జికల్ సూది బయటపడటంతో వారు కూడా కంగుతిన్నారు.

ఇక ముందు చికిత్స చేసి సర్జికల్ సూది తలలో పెట్టి కుట్లు వేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ వద్ద బాధిత యువతి తరఫు కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. అయితే.. చికిత్స చేసినప్పుడు వైద్యుడు మద్యం మత్తులో ఉన్నాడనీ.. అందుకే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. ఈ విసయం హాపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్ సునీల్ త్యాగి వరకు వెళ్లింది. ఆయన ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Next Story