కెప్టెన్ హెల్త్ బాగున్నట్లే..!

DMDK Chief Vijayakanth Health is stable.కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ అనారోగ్య

By M.S.R  Published on  6 Sep 2021 8:23 AM GMT
కెప్టెన్ హెల్త్ బాగున్నట్లే..!

కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..! ఆయ‌న ఆరోగ్యానికి సంబంధించి అనేక పుకార్లు వ‌స్తుండ‌డంతో అభిమానుల్లో ఆందోళ‌న మొదలైంది. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విష‌మించింద‌ని, అత్యవసర చికిత్స కోసం ఆయన చెన్నై నుంచి దుబాయ్ వెళ్లిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అవసరమైతే అట్నుంచి అటు ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసి పెట్టారని అన్నారు. తాజాగా విజ‌యకాంత్ త‌న ఆరోగ్యంపై స్పందించారు.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని డీఎండీకే అధినేత విజయకాంత్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తాను నటించిన క్షత్రియన్‌ను ఆస్పత్రి నర్సు లతో కలిసి చూస్తూ.. కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. గతేడాది కరోనా బారిన పడ్డారు విజ‌యకాంత్. వైరస్ సోకి ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ టైమ్ లో కూడా ఆయన హెల్త్ కండిషన్ పై పార్టీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. హాస్పిటల్ లో జాయిన్ అయిన 2 రోజులకు కరోనా అనే విషయాన్ని ప్రకటించారు. ఇక విజ‌య్ కాంత్ ఆరోగ్యం బాగుందని తెలియడంతో పార్టీలోనూ, ఆయన అభిమానుల్లోనూ ఆనందం వెళ్లి విరుస్తోంది.

Next Story
Share it