కాఫీ షాప్ లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్ వీడియో రికార్డింగ్, ఎంప్లాయ్ అరెస్ట్
బెంగళూరులోని ప్రముఖ కాఫీ షాపులో పనిచేస్తున్న 23 ఏళ్ల వ్యక్తి మహిళల వాష్‌రూమ్‌లో ఫోన్‌ను సీక్రెట్‌గా దాచి పెట్టాడు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 10:13 AM ISTకాఫీ షాప్ లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్ వీడియో రికార్డింగ్, ఎంప్లాయ్ అరెస్ట్
బట్టల దుకాణాల్లోని ఛేజింగ్ రూములు, మరికొన్ని కొన్ని చోట్ల సీక్రెట్ కెమెరాలను అమర్చి మహిళల న్యూడ్ వీడియోలను రికార్డు చేస్తుంటారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా ఓ కాఫీ షాపులో ఎంప్లాయ్ ఇదే పాడుపనికి పాల్పడ్డాడు. బెంగళూరులో చోటుచేసుకుంది ఈ సంఘటన. పోలీసులు కాఫీ షాపులో పనిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.
బెంగళూరులోని ప్రముఖ కాఫీ షాపులో పనిచేస్తున్న 23 ఏళ్ల వ్యక్తి మహిళల వాష్‌రూమ్‌లో ఫోన్‌ను సీక్రెట్‌గా దాచి పెట్టాడు. వీడియో రికార్డింగ్ ఆన్ చేసి అక్కడ ఉన్న డస్ట్‌బిన్‌లో దాచి పెట్టాడు. అయితే.. ఫోన్ సౌండ్ రాకుండా ఫ్లైట్ మోడ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఎలాగో ఓ మహిళ డస్ట్‌బిన్‌లో ఉన్న ఫోన్‌ను గుర్తించింది. చివరకు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మనోజ్ బెంగళూరులోని గుట్టహళ్లి నివాసి. 6 నెలలుగా బీఈఎల్ రోడ్‌లోని థర్డ్ వేవ్ కాఫీ షాప్‌లో పనిచేస్తున్నాడు.
అయితే ఫోన్‌ను గుర్తించిన సదురు మహిళ.. రెండు గంటల పాటు వీడియో రికార్డు అయినట్లు గుర్తించినట్లు తెలిపింది. టాయిలెట్ సీట్‌కు ఎదురుగా దాన్ని అమర్చినట్లు వివరించింది. డస్ట్‌బిన్ బ్యాగ్‌లో కెమెరా కనిపించేలా రంధ్రం చేసి ఫోన్‌ను ఉంచాడని పోస్టులో పేర్కొంది. కేఫ్‌లు, రెస్టారెంట్‌లు ఇలా ఎంత పెద్ద బ్రాండ్‌కు చెందినవి అయినా సరే.. వాష్‌రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.
ఈ మేరకు సంఘటనపై థర్డ్ వేవ్ కాఫీ యాజమాన్యం స్పందించింది. దీనిపై చింతిస్తున్నట్లు పేర్కొంది. యాజమాన్యం సదురు ఉద్యోగిని తొలగించినట్లు చెప్పింది. ఇలాంటి చర్యలు తమ కాఫీ షాపులో ఆమోదయోగ్యం కాదని చెప్పాలనుకుంటున్నామని పేర్కొంది. కస్టమర్లకు భరోసా ఇవ్వడంలో వేగంగా పనిచేస్తున్నామని థర్డ్ వేవ్ కాఫీ యాజమాన్యం పేర్కొంది.