కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన CISF మహిళా కానిస్టేబుల్
బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 1:55 PM GMTకంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన CISF మహిళా కానిస్టేబుల్
బాలీవుడ్ హీరోయిన్.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చంఢీగడ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టింది. చెంపదెబ్బ కొట్టిన తర్వాత కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిడుతూ మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే సంఘటనపై కంగనా రనౌత్ కూడా స్పందించింది. ఒక వీడియోను విడుదల చేసింది.
గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగనా రనౌత్.. విమానం ఎక్కేందుకు చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. బోర్డింగ్ పాయింట్‌కు వెళ్తుంగా అనూహ్య సంఘటన జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేశారు. అప్పుడు రైతులను అగౌరవపరుస్తూ కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేశారనీ.. అందుకే ఆమెను మహిళా జవాన్ కొట్టిందని తెలుస్తోంది. కాగా.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగనా రనౌత్ విజయం సాధించారు.
కాగా.. సీఐఎస్‌ఎఫ్ జవాను చెంపదెబ్బ కొట్టడంపై వార్తలు రావడంతో కంగనా రనౌత్ కూడా స్పందించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. సీఐఎస్‌ఎఫ్ జవాను కొట్టిందంటూ తనకు చాలా కాల్స్ వస్తున్నాయనీ.. అందుకే వీడియో చేస్తున్నానని చెప్పారు. ఈ సంఘటన జరిగింది వాస్తవమే అని చెప్పారు. సెక్యూరిటీ చెకింగ్ వద్ద ఘటన జరిగిందన్నారు కంగనా రనౌత్. సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ తనవైపు వచ్చి కొట్టడంతో పాటు.. దూషించారని వీడియోలో పేర్కొన్నారు. ఎందుకిలా చేశావని అడిగితే.. రైతులకు మద్దతుదారు అని ఆమె చెప్పిందన్నారు. అయితే.. తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాననీ.. పంజాబ్‌లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉందని కంగనా రనౌత్ చెప్పారు. ఈ సంఘటనపై స్పందించిన సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్.. దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంగానను కొట్టిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
CISF constable "Kulwinder Kaur" slapped Mandi MP #KanganaRanaut
— ⲧⲏꪋӄú𝚛 (@Thakur_rj7774) June 6, 2024
क्या "महिला जवान" द्वारा उठाया कदम सही था? pic.twitter.com/rNEVk0z3dU pic.twitter.com/2cfAHng2iO