పోక్సో కేసులో బీజేపీ నేత యడియూరప్పకు సీఐడీ నోటీసులు

యడియూరప్పపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి సీఐడీ నోటీసులు జారీ చేసింది.

By M.S.R  Published on  12 Jun 2024 4:00 PM GMT
cid notice,  bjp leader yediyurappa, pocso case,

పోక్సో కేసులో బీజేపీ నేత యడియూరప్పకు సీఐడీ నోటీసులు 

బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత విచారణలో పాల్గొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 17 ఏళ్ల అమ్మాయి తల్లి ఫిర్యాదు ఆధారంగా యడ్యూరప్పపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 354 A (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన సమావేశంలో తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లి ఆరోపించింది. బాధిత బాలిక త‌ల్లి మార్చి 14వ తేదీన స‌దాశివ‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్ప‌గిస్తూ క‌ర్ణాట‌క డీజీపీ అలోక్ మోహ‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో యెడియూర‌ప్ప‌కు నోటీసులు జారీ అయ్యాయి. తాను ఎవ‌ర్నీ కూడా లైంగికంగా వేధించ‌లేద‌ని, ఈ కేసు విష‌యంలో న్యాయ పోరాటం చేస్తాన‌ని యడియూరప్ప ఇప్పటికే ప్రకటించారు.

Next Story