వ్యభిచార గృహానికి రక్షణ కోరుతూ పిటిషన్.. కోర్టు ఏం చేసిందంటే..

చెన్నై హైకోర్టులో ఆశ్చర్యకర పిటిషన్ దాఖలు అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  26 July 2024 7:15 AM GMT
chennai high court, advocate,  protection,  brothel house,

వ్యభిచార గృహానికి రక్షణ కోరుతూ పిటిషన్.. కోర్టు ఏం చేసిందంటే..

చెన్నై హైకోర్టులో ఆశ్చర్యకర పిటిషన్ దాఖలు అయ్యింది. ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అని చెప్పుకొనే ఓ వ్యక్తి తమిళనాడులో వ్యభిచార గృహం నడుపుతున్నందుకు భద్రత కల్పించాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదురు పిటిషన్‌ దారుకి జరిమానా విధించింది.

కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్‌లో పిటిషనర్ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ విషయం తెలుసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని అతను హైకోర్టును ఆశ్రయించాడు. అంతేకాదు.. వ్యభిచార గృహాన్ని నడుపుతున్న తమకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. తాను ట్రస్టును నడుపుతున్నానని, ఇందులో పెద్దల మధ్య అంగీకార సెక్స్‌పై కౌన్సెలింగ్, 18 ఏళ్లు పైబడిన వారికి ఆయిల్ బాత్ వంటి సేవలు అందిస్తున్నట్లు పిటిషన్‌దారుడు పేర్కొన్నాడు. వ్యభిచార గృహం నిర్వహణలో పోలీసుల జోక్యాన్ని ఆపాలని ఆదేశించాలని కోర్టును కోరాడు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం దాన్ని తిరస్కరించింది. బుద్ధదేవ్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుడు సందర్భంలో మురుగన్ అర్థం చేసుకున్నారని తెలిపింది. బుద్ధదేవ్ కేసు కింద సెక్స్ వర్కర్ల అక్రమ రవాణా, పునరావాసం నిరోధానికి సుప్రీం కోర్టు హామీ ఇచ్చిందని హైకోర్టు పేర్కొంది. ప్రసిద్ధ న్యాయ కళాశాలల గ్రాడ్యుయేట్‌లకు మాత్రమే సభ్యత్వం ఇచ్చేలా బార్ కౌన్సిల్‌ను కోరింది. అలాగే పిటిషనర్‌కు రూ.10,000 జరిమానా కూడా విధించింది చెన్నై హైకోర్టు.

Next Story