ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి కేంద్రం గుడ్‌న్యూస్
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 7:04 AM ISTఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి కేంద్రం గుడ్‌న్యూస్
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్న వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఇస్తున్నాయి బ్యాంకులు. అయితే.. ఇతర పెట్టుబడి మార్గాల్లో అంతకు మించిన రాబడులు వస్తున్న నేపథ్యంలో డిపాజిట్ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఈ క్రమంలో డిపాజిట్లు తగ్గితే బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థిపై తీవ్ర ప్రభావం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. బ్యాంకులకు పలు కీలక సూచనలు చేశారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల ను ఆకర్సించేందుకు వినూత్న ప్రాడక్టులనుతీసుకు రావాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఇచ్చే రుణాలకు, డిపాజిట్ల మధ్య సమతూకం ఉండాలని ఆమె సూచించారు. డిపాజిట్ల సేకరణ అంశంపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. డిపాజిట్ల ద్వారా వచ్చిన నిధులను అవసరమైన వారికి లోన్లు అందించాలని కేంద్ర మంత్రి నిర్మల సూచించారు. అలా చేసినప్పుడే రుణాలకు, డిపాజిట్లకు మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని సూచించారు. అందుకోసం బ్యాంకులు వినూత్న, ఆకర్షణీయమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొచ్చి డిపాజిట్లను పెంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలలా సీతారామన్ చెప్పారు.