భార్య‌కు భ‌ర్త ఆదాయం గురించి తెలుసుకునే హక్కు ఉంది.. ఎలాగంటే..?

Central Information Commission .. భార్య‌కు త‌న భ‌ర్త ఆదాయం ఎంతో తెలుసుకునే హ‌క్కు ఉంద‌ని కేంద్ర స‌మాచారం క‌మిష‌న్‌

By సుభాష్  Published on  19 Nov 2020 1:36 PM IST
భార్య‌కు భ‌ర్త ఆదాయం గురించి తెలుసుకునే హక్కు ఉంది.. ఎలాగంటే..?

భార్య‌కు త‌న భ‌ర్త ఆదాయం ఎంతో తెలుసుకునే హ‌క్కు ఉంద‌ని కేంద్ర స‌మాచారం క‌మిష‌న్‌(సీఐసీ) ప్ర‌క‌టించింది. భార్య మూడవ పార్టీకి చెందినదని, ఐటీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని సీఐసీ తిరస్కరించింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం(ఆర్టీఐ) ద్వారా భార్య‌.. త‌న భ‌ర్త ఆదాయం గురించి తెలుసుకోవ‌చ్చున‌ని సీఐసీ పేర్కొంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ నగరానికి చెందిన రహమత్ బానో తన భర్త ఆదాయ వివరాలను తెలియజేయాలని ఆదాయపన్ను శాఖను కోరగా అందుకు ఐటీ శాఖ తిర‌స్క‌రించింది. దీంతో ఆమె సీఐసీకి అప్పీల్‌ చేసుకోగా.. భర్త ఆదాయం గురించి భార్య సమాచారం తెలుసుకోవడం సమాచార హక్కుకు సంబంధించినది కాదని ఆదాయపు పన్ను శాఖ వాదనను సీఐసీ తప్పుపట్టింది. మహిళ రహమత్ బానోకు 15రోజుల్లోగా భర్త ఆదాయం గురించి సమాచారం అందించాలని కమిషన్ జోద్ పూర్ ఐటీ విభాగం అధికారులను ఆదేశించింది. ఇది వ్యక్తిగత సమాచారమని, దీన్ని వెల్లడించడం కుదరదంటూ ఆమె భర్త చేసిన వాదన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడిందని భార్య తరపు న్యాయవాది రజక్‌ హైదర్‌ వెల్లడించారు కాగా.. ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకు వారి భర్తల జీతాల వివరాలను తెలుసుకునే హక్కు ఉందని కేంద్ర సమాచార కమిషన్ 2014లో పేర్కొంది.

Next Story