ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి హోంమంత్రి అమిత్‌షా కీలక ఆదేశాలు

జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ఆదివారం ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షా సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  17 Jun 2024 7:08 AM IST
home minister amit shah,  terrorism, jammu Kashmir ,

ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి హోంమంత్రి అమిత్‌షా కీలక ఆదేశాలు

జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ఆదివారం ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో తీవ్రంగా ఉన్న ఉగ్రవాద సమస్యపై చర్చించారు. వారిని అణచివేసేందుకు హోంమంత్రి అమిత్‌షా పలు కీలక ఆదేశాలను జారీ చేశారు.

కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను అణచివేసేందుకు ఏరియా డామినేషన్, జీరో టెర్రర్ ప్రణాళికలను అమలు చేయాలని హోంమంత్రి అమిత్‌షా ఏజెన్సీలను ఆదేశించారు. మిషన్ మోడ్‌లో సమన్వయంతో పని చేసి సత్వరంగా స్పందించాలని అమిత్‌షా చెప్పారు. ఏజెన్సీలు సమన్వయాన్ని కొనసాగించి సున్నితమైన ప్రాంతాలను గుర్తించానల్నారు. ఆ తర్వాత వాటి భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసేంత వరకు తాము కృషి ఏస్తూనే ఉంటామన్నారు. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించారు. ఉగ్రదాడులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయనపై కీలక సూచనలు చేశారు. వారి దాడులను నియంత్రించేందుకు భద్రతా దళాలు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.

మరోవైపు జూన్ 29వ తదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కాబోతుంది. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చొరబాటు దారులను అడ్డుకునేందుకుందుకు కూడా చర్యలను తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దులతోపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు.

Next Story