భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జెడ్ కేటగిరీ భద్రత
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జెడ్ కేటగిరీ భద్రత
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు వీఐపీ భద్రత కల్పించారు. ఈ మేరకు ఆయనకు జెడ్ కేటగిరీ కింద వీఐపీ భద్రతను కల్పించారు. ఈ మేరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుఆర్ సాయుధ కమాండో దళాలు పూర్తి భద్రతను కల్పించనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాజీవ్ కుమార్‌కు ముప్పు పొంచి ఉందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికార వర్గాలు జెడ్ కేటగిరి భద్రతను నియమిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కాగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ముప్పు పొంచి ఉందనీ.. భద్రతా ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల సిఫార్సు చేశాయి. వారి సిఫార్సులను పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరి కింద వీఐపీ భద్రతను ఏర్పాటు చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు రక్షణ విధుల్లో పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.
కాగా.. రాజీవ్ కుమార్ 2020లో ఎన్నికల కమిషనర్‌గా నియామకం అయ్యారు. 1984 ఐఏఎస్‌కు బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ఇక 2022 మే 15వ తేదీన 25వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం 18వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో ఆయన కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ముప్పు పొంచి ఉందనే సూచనలతో కేంద్రం ఆయనకు భద్రతను కల్పించింది.