ఎన్నికల ముందు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 5:51 PM IST
ఎన్నికలకు ముందు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా వర్గాలకు తాయిలాలు ప్రకటించింది. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందంచే సోలార్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ కేబినెట్ భేటిలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు వివరించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. 2024 ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల రాయితీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. అలాగే ఐదు రకాల ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపారు. ఏప్రికల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎరువుల రాయితీ అమలు చేయనున్నారు. పీఎం సూర్య ఘర్ యోజనకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి చెప్పారు. దీనికోసం రూ.75,021 కోట్ల నిధులను కేటయించిందన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, గత సీజన్‌లో ఉన్న ధరలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అలాగే కోటి గృహాలకు సోలార్ విద్యుత్ అందించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ పథకం ప్రారంభంఅవుతుందని ప్రధాని మోదీ చెప్పిన విషం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఒక్కో గృహానికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ ద్వారా పీఎం సూర్య ఘర్ యోజనకు సబ్సిడీని కేంద్రం అందించనుంది. 1kW అయితే రూ.30 వేలు, 2kW అయితే రూ.60 వేలు, 3kW అయితే రూ.78 వేల సబ్సిడీ వస్తుంది.