ఫేక్‌ అరెస్ట్‌ వీడియో తీసుకున్న నటి.. చివరకు నిజంగానే కేసు నమోదు

ఉర్ఫీ జావెద్‌కు సంబంధించిన ఓ వీడియో శుక్రవారం తెగ వైరల్ అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  4 Nov 2023 7:45 AM IST
case booked,  urfi javed,  fake video,

 ఫేక్‌ అరెస్ట్‌ వీడియో తీసుకున్న నటి.. చివరకు నిజంగానే కేసు నమోదు 

బాలీవుడ్‌ సీరియల్ నటి ఉర్ఫీ జావెద్‌ ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఈమె ఆడియెన్స్‌లో గుర్తింపు కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-1లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత నుంచి ఆమె క్రేజ్‌ను సంపాదించుకంది. ఆ తర్వాత దుస్తుల ధరించడంలో వినూత్నంగా ప్రవర్తిస్తుంటుంది. బోల్డ్‌ అవుట్‌ ఫిట్లలో పబ్లిక్‌లో తిరుగుతూ ఉర్ఫీ జావెద్ హంగామా చేస్తూ ఉంటుంది. అయితే.. ఉర్ఫీ జావెద్‌కు సంబంధించిన ఓ వీడియో శుక్రవారం తెగ వైరల్ అయ్యింది.

అయితే.. ఆ వీడియోలో ఏముందంటే..ఉర్ఫీ జావెద్‌ ఉదయం కాఫీ కోసం బయటకు వచ్చింది. ఓ కాఫీ షాపు వద్ద ఉండగా అంతలోనే అక్కడికి ఒక బ్లాక్‌ స్కార్పియోలో పోలీసులు వస్తారు. ఆమెను దగ్గరకు రావాలని పిలుస్తారు. దాంతో.. కాఫీ షాపు నుంచి పక్కకు వస్తుంది. రెడ్‌ బ్యాక్‌లెస్‌ టాప్.. డెనిమ్‌ జీన్స్‌ దరించి ఉంటుంది. ఆమెను ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకుంటారు. ఉర్ఫీ ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. కానీ.. వారేమీ వివరాలు చెప్పకుండా పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశిస్తారు. ఆ తర్వాత ఆమె రెండు చేతులను పట్టుకుని కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఈ వీడియోనే వైరల్ అయ్యింది. దీనిపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. కొందరు మాత్రం ప్రాంక్‌ వీడియో అంటూ కామెంట్స్ చేశారు.

చివరకు ఈ వీడియోపై ముంబై పోలీసులు స్వయంగా స్పందించారు. అది ఫేక్‌ వీడియో అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఈవీడియో వైరల్‌ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. పబ్లిసిటీ కోసం చట్టాన్ని ఉల్లంఘించరాదంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే పోలీసు యూనిఫాంను కూడా దుర్వినియోగం చేశారంటూ వెల్లడించారు ముంబై పోలీసులు. తప్పుదారి పట్టించే వీడియోలో ఉన్న వారిపై సెక్షన్ 171, 419, 500, 34 ఐపిసి కింద క్రిమినల్ కేసు నమోదు చేయబడిందని చెప్పారు. వాహనం కూడా స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఇక ఉర్ఫీ ఫ్యాషన్ ఛాయిస్ పై ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. గతంలో బంద్రా పోలీస్ స్టేషన్ లో ఆమె ఎంచుకుంటున్న దుస్తులపై కేసు ఫైల్ అయ్యింది.

Next Story