భారత్-పాక్ సరిహద్దులో డ్రోన్ల కలకలం

BSF opens fire at drone along Indo-Pak border.భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం మొదలైంది. గత అర్దరాత్రి పంజాబ్

By M.S.R  Published on  28 Oct 2021 6:46 PM IST
భారత్-పాక్ సరిహద్దులో డ్రోన్ల కలకలం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం మొదలైంది. గత అర్దరాత్రి పంజాబ్ రాష్ట్రంలోని మృత్‌సర్‌ అజ్నాలా పోలీసుస్టేషన్ పరిధిలోని షాపూర్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద డ్రోన్ కనిపించింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లోని 73వ బెటాలియన్ జవాన్లు డ్రోన్‌పై కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ పాక్ వైపు తిరిగి వెళ్లింది. పాక్ నుంచి భారత్ వైపు భూభాగంలో ఆయుధాలు, డ్రగ్స్ ను వదిలేందుకు పాకిస్థాన్ డ్రోన్లను అర్దరాత్రి పంపించిందని అధికారులు. గతంలో పలు మార్లు డ్రోన్లు ఇలా రావడం.. వాటిని భారత ఆర్మీ కూల్చేసిన సంగతి తెలిసిందే.

జ‌మ్మూక‌శ్మీర్‌లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయడానికి చాలా కాలంగా పాక్ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. జమ్ము ఎయిర్ పోర్టులో డ్రోన్ తో దాడి జ‌రిగిన అనంత‌రం భార‌త్ మ‌రింత అప్ర‌మ‌త్త‌మై డ్రోన్ల‌పై నిఘా పెంచింది. అక్టోబరు 19, 20వతేదీ మధ్య అమృత్‌సర్ సెక్టార్‌లోని ఇండో-పాక్ సరిహద్దుల్లోనూ ఇలాంటి డ్రోన్ కనిపించింది. ఆ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేయగా, దాంతో పాటు కిలో హెరాయిన్ తోపాటు ఇనుప ఉంగరం లభించింది. సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం పెరగడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరించారు.

Next Story